ముందు మాట: ఈ వ్యాసంలో ప్రతి మాట కావాలనే తెలంగాణావారిని కించపరిచే విధంగా, తెలంగాణావారి మనోభావాలను దెబ్బతీసే విధంగా, తెలంగాణా స్వాతంత్ర్య (మరియు పునర్నిర్మాణ) ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా వుంటుందని గుర్తించవలసిందిగా మనవి. ఇది నచ్చని వారు, అటువంటి ప్రతి మాటని ఒకటికి రెండు సార్లు చదివి తరించగలరని నా ఆకాంక్ష.
నేనొక ఆంధ్రా పెట్టుబడీదారుడను. ఆంధ్రా పెట్టుబడీదారుడను అనే పద ప్రయోగం అనవసరం. తెలంగాణాలో పెట్టుబడీదారులు వుండరు. దానికి ఒక కారణం తెలంగాణా గడ్డ బిడ్డలైన అందరూ కేవలం తెలంగాణా దేశ భక్తులు. రెండో కారణం తెలంగాణా భాషలో అసలు పెట్టుబడీదారుడు అనే పదమే లేకపోవటం. పెట్టుబడీదారుడు అనేది తెలుగు పదం.
నాకు తెలంగాణాలో ఒక రైస్ మిల్లు, రియల్ ఎస్టేట్ బిజినెస్, ఒక ఐటీ కంపెనీ వున్నాయి. వీటిలో నేను, అందరి పెట్టుబడీదారుల లాగానే కేవలం ఆంధ్రా వారికే ఉద్యోగాలు ఇచ్చాను. కావాలని తెలిసి తెలిసి తెలంగాణా గడ్డకు, ఆ గడ్డ బిడ్డలకు అన్యాయం చేశాను. ఈ వ్యాపారాల మూలంగా నాకు పలు ఆంధ్రా రాజకీయనాయకులతో పరిచయం ఏర్పడింది. ఆంధ్రా రాజకీయనాయకులు అనే పద ప్రయోగం అనవసరం. తెలంగాణాలో రాజకీయనాయకులు వుండరు. దానికి ఒక కారణం తెలంగాణా గడ్డ బిడ్డలైన అందరూ కేవలం తెలంగాణా దేశ భక్తులు. రెండో కారణం తెలంగాణా భాషలో అసలు రాజకీయనాయకుడు అనే పదమే లేకపోవటం. రాజకీయనాయకుడు అనేది తెలుగు పదం.
ఆ పరిచయం ప్రణయానికి పరిణయానికి దారితీయక పోయినా, నాకు ఉపయోగపడే స్నేహం దాకా వచ్చింది. ఆ స్నేహం కారణంగా మా బంధువులకు స్నేహితులకు తెలంగాణాలో విద్య ఉద్యోగ వ్యాపార అవకాశలు వచ్చి, వారు తెలంగాణాకు వలస రావటం జరిగింది. ఇక్కడి తెలంగాణా గడ్డ బిడ్డలపైన మా వారి పెత్తనం అజమాయిషీ జులుం పెరిగింది. క్రమంగా మా వారు తెలంగాణా గడ్డ బిడ్డలను అణగదొక్కుతూ, అలా అణగదొక్కిన తెలంగాణా గడ్డ బిడ్డల్నే మెట్లుగా చేసి, అంచెలంచెలుగా ఎదిగారు. వారి భాషని యాసని అడుగడునా అవహేళనాపహాస్యం చేశారు. మానవత్వం అనే పసికందుని హత్య చేసిన కసాయి హంతకులయ్యారు.
నేను చేసిన చెడ్డ పనులు, నాకు ఈనాటికిగానీ తెలియరాలేదు. ఇప్పటిదాకా జరిగిన సంఘటనలని తెలంగాణా ఉద్యమకెలిడియోస్కోపుకోణంలోంచి చూస్తే నేను చేసిన నేరాలు ఘోరాలు, తప్పులు పాపాలు, అక్రమాలూ అన్యాయాలు అన్నీ నన్ను కొట్టొచ్చినట్టు కనిపించాయి. తెలంగాణా గడ్డ బిడ్డల ఉనికి కోసం జరుగుతున్న ఒక పోరాటౌద్యమమన్న నిష్ఠూర నిజం నాకు కనిపించి వినిపించి ఊగించి ఊదరగొట్టింది.
2009 2010లలో జరిగిన రాళ్ళు రువ్వటం వంటివి, గొడవలని కొట్టిపారేశాను. వాటిని గొడవలనటం పొరపాటు. తెలంగాణాలో స్వాతంత్ర్య పోరాటాలు, ఆత్మ గౌరవ ఆందోళనలు తప్ప గొడవలు జరగవు. దానికి ఒక కారణం తెలంగాణా గడ్డ బిడ్డలైన అందరూ కేవలం తెలంగాణా దేశ భక్తులు. రెండో కారణం తెలంగాణా భాషలో అసలు గొడవ అనే పదమే లేకపోవటం. గొడవ అనేది తెలుగు పదం. గొడవ అనేది ఆంధ్రా వారైన కోదండరామి రెడ్డి గారి దర్శకత్వంలో, రెడ్డి గారి అబ్బయి తొలి పరిచయంగా ఫ్లాపైన ఒక సినిమా. అయితే ఈ విషయం ప్రస్తుతం అనవసరం.
ఇప్పటిదాకా తెలంగాణా గడ్డ బిడ్డల ఆందోళనలు ఒక ఎత్తు. నిన్న, అంటే ఫిబ్రవరి 17న, తెలంగాణా గాంధీ అయిన కేసీఆర్ అనుయాయిలైన తెలంగాణా నెహ్రూ అయిన హరీష్ రావు తెలంగాణా పటేల్ అయిన కేటీఆర్ల ఆగ్రహం సాక్షాత్తు అసెంబ్లీలో కట్టలు తెంచుకోవటం ఒక ఎత్తు.
ముందుకు వెళ్ళే ముందు ఒక్క సారి వెనక్కి తిరిగి చూద్దాం. తెలంగాణా పాలిటి తెల్ల దొరలమైన మేము చేసిన ఆకృత్యాలకి నిలువుటద్దం ఈనాటి స్థితి. తెలంగాణా చరిత్రలో మొదటి స్వాతంత్ర్య పోరాటం 1969-1971లలో జరిగిన ఉద్యమం. తెలంగాణా చరిత్రలో జరిగిన సైమన్ గో బ్యాక్, 2010 మార్చిలో జరిగిన శ్రీకృష్ణ గో బ్యాక్ ప్రదర్శన. తెలంగాణా చరిత్రలో జరిగిన సహాయనిరాకరణ నిన్న, అంటే ఫిబ్రవరి 17న మొదలయ్యింది. తెలంగాణా చరిత్రలో అజాద్ హింద్ ఫౌజు అక్షరాలా అన్నలే!
ఇంకా లోతుగా ఆలోచిస్తే, తెలంగాణా చరిత్రలో ముఘల్ చక్రవర్తులు నిజంగా నిజాములే అని, తెలంగాణా చరిత్రలో గంగా నది గలా గలా పారే గోదావరే అనీ, ఈనాటి ఈ తెలంగాణా గడ్డ ప్రత్యేక రాష్ట్ర వాంఛ ఆ నాటి ఆ భారత ఖండ స్వేఛ్ఛా ఇఛ్ఛ అని ఇట్టే అర్ధమయ్యింది. జ్ఞానోదయమయ్యింది.
వాస్తవాలు చట్టాలు అనే ఒట్టి మాటలు మాట్లాడే వారికి నిన్న, అంటే ఫిబ్రవరి 17న అసెంబ్లీ బయట జరిగిన 'దాడి' సమంజసమేననిపించింది. అయితే ఇక్కడ మనం అర్ధం చేసుకోవాల్సిన విషయాలు రెండున్నాయి.
ఒకటి: దాడి జరిగింది. కానీ అది తెలంగాణా ప్రజా ప్రతినిధులు చేయలేదు. తెలంగాణాలో ప్రజా ప్రతినిధులు దాడి చేయరు. దానికి ఒక కారణం తెలంగాణా గడ్డ బిడ్డలైన అందరూ కేవలం తెలంగాణా దేశ భక్తులు. రెండో కారణం తెలంగాణా భాషలో అసలు దాడి అనే పదమే లేకపోవటం. దాడి అనేది తెలుగు పదం.
రెండు: ఎలాగైతే తెలంగాణాలో అడ్డంగా నరికెయ్యటం అంటే కేవలం అభిప్రాయ భేదమనే అర్ధం వస్తుందో, అలాగే చేయిచేసుకోవటం అంటే కేవలం నిరసన తెలియజేయటం. ప్రజాస్వామ్యం గురించి లెక్చర్లు దంచే వారికి శాంతియుతంగా నిరసన తెలియజేయటం అప్రజాస్వామ్యం అని అనిపించింది. కలికాలం! కానీ తప్పకుండా తెలంగాణాకు కలిసొచ్చే కాలం.
జై తెలంగాణా!
చివరి మాట: ఈ పై వ్రాయబడిన వాటికి సంబంధించిన ఆధారాలు మీకు ఎంత ప్రయత్నించినా దొరకవు. దానికి ఒక కారణం తెలంగాణా గడ్డ బిడ్డలైన అందరూ కేవలం తెలంగాణా దేశ భక్తులు. రెండో కారణం తెలంగాణా భాషలో అసలు ఆధారాలు అనే పదమే లేకపోవటం. ఆధారాలు అనేది తెలుగు పదం.
తెలంగాణా ఇవ్వకపోతే ఎలాగైతే జైబోలోతెలంగాణా చలన చిత్రం రెండవ భాగం విడుదల అవుతుందో, అలాగే ఈ సంచలన వ్యాసం రెండవ భాగం పోస్టవుతుంది. యుపీఏ భాగస్వాములూ! ఇక మీ ఇష్టం.
వ్యాసం సరిగ్గా కనపడనిచో ఈ లింక్ పనిచేస్తుందేమో ప్రయత్నించండి:
You are viewing
bpraveen's journal